మేఘాలయలో బా బా బ్లాక్షీప్ షూటింగ్: సీఎం కొన్రాడ్ కే సంగ్మా ప్రశంసలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: షిల్లాంగ్

మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న తొలి దక్షిణాది చిత్రంగా 'బా బా బ్లాక్షీప్' నిలవడం గర్వకారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్ కే సంగ్మా తెలిపారు. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈ క్రైమ్ కామెడీ సినిమా అక్టోబర్ తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేఘాలయ ప్రకృతి అందాలను తెరపైకి తీసుకురావడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ చిత్ర యూనిట్కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.