బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్ నేర రాజకీయాలు చేస్తున్నారన్న చంద్రబాబు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమరావతి

అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని రాష్ట్రంలోకి రౌడీషీటర్లను, కరుడుగట్టిన క్రిమినల్స్ను పంపిస్తూ పక్కా ప్రణాళికతో నేరాలు చేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని అణచివేసేందుకు ఆస్తుల ధ్వంసంపై నష్టపరిహారం వసూలు చేసేలా కఠినమైన కొత్త చట్టాన్ని తీసుకువస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.