ఈవీఎంల పనితీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసిన వాసుపల్లి గణేష్ కుమార్
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో దొంగ ఓట్లు భారీగా పడ్డాయని, ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. పోలింగ్ శాతం మరియు తుది గణాంకాల మధ్య వ్యత్యాసంపై వివరణ ఇవ్వాలని కోరారు.