లండన్ థేమ్స్ నది ఒడ్డున తొలిసారిగా ఘనంగా గంగా హారతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున తొలిసారిగా అంగరంగ వైభవంగా గంగా హారతి నిర్వహించారు. చిన్మయ మిషన్ యూకే ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. చిన్మయ మిషన్ 75 వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పవిత్ర దీపాలు, వేద మంత్రోచ్ఛారణలతో థేమ్స్ తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది.