సన్న బియ్యం నిల్వల్ లో నిర్లక్ష్యం వద్దు: అధికారులను ఆదేశించిన కలెక్టర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: কোదాडा
పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యం నిల్వ మరియు నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. కోదాడ సమీపంలోని బాలాజీనగర్ గోదాంను కలెక్టర్, ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలు, స్టాక్ రికార్డులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేస్తూ గోదాంలో పనిచేస్తున్న హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.