'డ్రగ్స్‌కు దూరంగా ఉండండి': విజయనగరంలో ఈగల్‌ బృందం అవగాహన

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ఈగల్‌ పోలీసులు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'డ్రగ్స్‌ వద్దు బ్రో' నినాదంతో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ గంజాయి, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ, డ్రగ్స్‌కు బానిసైన వారికి మహారాజా ఆసుపత్రిలోని డి-అడిక్షన్‌ కేంద్రంలో చికిత్స, పునరావాసం కల్పిస్తున్నట్లు ఎస్సై స్వీటీ తెలిపారు.