పంజాబ్లో తీవ్ర కలకలం: యాక్టివిస్ట్ హత్యకు నిరసనగా చీపుర్ల దహన నిరసన
రిపోర్టర్: కిరణ్
స్థలం: Mansa
మాన్సాలో డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త పర్విందర్ సింగ్ ఝోటా హత్య ఘటనపై రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. ఆప్ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చీపుర్ల దహన నిరసనకు యాక్షన్ కమిటీ పిలుపునిచ్చినట్లు కమిటీ సభ్యుడు మాణిక్ గోయల్ వెల్లడించారు. శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రశ్నించే వారిని పొట్టనబెట్టుకుంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.