రూపాయనమః ఫస్ట్ లుక్ విడుదల చేసిన తరుణ్ భాస్కర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
అరవింద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రూపాయనమ:’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.