ప్రేమ పేరుతో నమ్మించి మోసం: యువకుడిపై రాజాపేట పోలీస్ స్టేషన్లో కేసు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో ప్రేమ పేరుతో నమ్మించి శారీరక సంబంధం ఏర్పరచుకుని, పెళ్లికి నిరాకరించి బెదిరింపులకు పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై దర్యాప్తు కొనసాగుతోందని స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.