ఆంధ్రప్రదేశ్‌లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్‌కు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో చేపల వేలం హాలు, శుద్ధికేంద్రం భవనాలను గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే శిరీషతో కలిసి ప్రారంభించారు. గత వైకాపా నిరంకుశ పాలనతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గాడిన పడిందని ఆయన స్పష్టం చేశారు.