విషాదం: ముప్ పై ఐదేళ్ల వయసులో కన్నుమూసిన ప్రముఖ కంట్రీ సింగర్
రిపోర్టర్: గోపి
స్థలం: Global
ప్రముఖ కంట్రీ మ్యూజిక్ త్రిసభ్య బృందం టేలర్ రెడ్ సభ్యురాలు నికోల్ టేలర్ ముప్ పై ఐదేళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ తో కన్నుమూశారని ఆమె సోదరీమణులు నికా టేలర్, నతాలీ టేలర్ తెలిపారు. ఈ విషాద వార్తను టిక్‌టాక్ వీడియో ద్వారా వెల్లడిస్తూ, ఆమె గత కొన్నేళ్లుగా మహమ్మారితో ఎంతో ధైర్యంగా పోరాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం అలుముకుందని, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారని వారు పేర్కొన్నారు.