వినయ్ భాస్కర్కు కేటీఆర్ ఫోన్.. పోలీసుల దాడిపై ఆరా

రిపోర్టర్: ISHAM JOURNALISM స్థలం: వరంగల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు తనపై దాడి చేశారని, తోపులాటలో చోటుచేసుకున్న పరిణామాలను వినయ్ భాస్కర్ వివరించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వినయ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేటీఆర్, చికిత్స వివరాలను తెలుసుకున్నారు.