మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని పాశం సునీల్ కుమార్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నిర్ణయం మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో దోహదపడుతుందని ఆయన వెల్లడించారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని, ఈ నిర్ణయం ద్వారా మహిళా లోకానికి మరింత భద్రత చేకూరుతుందని ఆయన స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.