బ్రిక్స్ ప్రత్యేక కరెన్సీ ప్రతిపాదనను తిరస్కరించిన భారత్
రిపోర్టర్: సతీష్
స్థలం: భారతదేశం
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలనే ప్రతిపాదనకు భారత్ సుముఖంగా లేదు. చైనా ఆర్థిక పెత్తనం పెరిగే ప్రమాదం ఉండటంతో పాటు ఆర్బీఐ స్వతంత్ర ద్రవ్య విధానాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో కేంద్రం దీనిని పక్కనపెట్టింది. దీనికి బదులుగా స్థానిక కరెన్సీల్లోనే ద్వైపాక్షిక వ్యాపారం జరపాలని భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది.