జగనన్న కాలనీల్లో కోట్ల అక్రమాలు: నిలదీస్తున్న నెల్లూరు రూరల్ ప్రజలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: నెల్లూరు
వైకాపా హయాంలో నెల్లూరు జిల్లాలోని జగనన్న కాలనీల నిర్మాణాల్లో సుమారు నూట ఇరవై కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. నివాసయోగ్యం కాని లోతట్టు ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడంతో చిన్నపాటి వర్షాలకే చెరువుల్లా మారుతున్నాయని, నాసిరకం పనులతో ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వస్తున్న వైకాపా నాయకులను ఇళ్ల నిర్మాణాలు ఎక్కడని స్థానికులు నిలదీస్తున్నారు.