పాలపిట్టల వ్యాపారంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలను బోనుల్లో బంధించి వ్యాపారం చేయడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలతో మూగజీవాలను హింసించే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పక్షుల స్వేచ్ఛను కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని, అసాధారణ చర్యలపై టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కమీషనర్ కోరారు.