ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు బొలెరో ఢీకొని పదిహేను మందికి గాయాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ములుగు

ములుగు జిల్లా తాడ్వాయి–పసర గ్రామాల మధ్య శుక్రవారం ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది బంజారా గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. మల్లంపల్లి మండలం సోమ్ల తండాకు చెందిన వీరు భద్రాచలం స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్సనందిస్తున్నారు.