ఏలూరులో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఏలూరు
ఏలూరు రూరల్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మిత్తిరెడ్డి సురేష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఆరు ఇంటిదొంగతనం కేసులకు సంబంధించిన బంగారం, వెండి వస్తువులు, టీవీలు, గ్యాస్ సిలిండర్లు, గోల్డ్ కాయిన్ తో పాటు ఒక హోండా యాక్టివా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.