నేపాల్ ఆసుపత్రితో ఏఎమ్‌వీఐ సాఫ్ట్‌వేర్ ఒప్పందం

రిపోర్టర్: గోపి స్థలం: నేపాల్

అమెరికాకు చెందిన ఏఎమ్‌వీఐ సాఫ్ట్‌వేర్ ఇంక్ సంస్థ అభివృద్ధి చేసిన అత్యాధునిక మెడికల్ ఇమేజింగ్ ప్లాట్‌ఫామ్ ఏఎంవీజన్ కోసం నేపాల్‌లోని కఠ్మాండు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌తో కీలక ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా వైద్య నిపుణుల సూచనలతో ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రతినిధి దేశాయి సిద్ధబత్తుల తెలిపారు.