పైప్ క్లీనర్లతో అద్భుత కళాకృతులు సృష్టిస్తున్న విజయవాడ యువతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

విజయవాడకు చెందిన యువతి భార్గవి పైప్ క్లీనర్లతో వినూత్న కళాకృతులు తయారు చేస్తూ ఉపాధి పొందుతోంది. సోషల్ మీడియా చూసి స్వయంగా ఈ కళను నేర్చుకున్న ఆమె, అచ్చం నిజమైన పూలను తలపించేలా అందమైన బొకేలు, హోమ్ డెకర్ వస్తువులు రూపొందిస్తోంది. సౌత్ ఇండియాలో ఈ ట్రెండ్‌కు తెరలేపిన భార్గవి ఉత్పత్తులకు ఇప్పుడు స్థానికంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.