భర్తను హత్య చేసి ట్రంకు పెట్టెలో పడేసిన భార్య
రిపోర్టర్: కృష్ణ
స్థలం: లక్నో
లక్నోలో మొదటి భార్యతో సంబంధం కొనసాగిస్తున్నాడనే కక్షతో సుఫియా బానే తన ప్రియుడు మున్నా, సహచరుడు మహమ్మద్ ఇక్బాల్‌తో కలిసి భర్త రామకిషోర్ వాల్మీకిని హత్య చేసింది. సెప్టెంబర్ 14న నిద్రలో ఉన్న రామకిషోర్‌ను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని ఒక పెట్టెలో దాచి ఆ తర్వాత ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ బ్రిడ్జి వద్ద పడవేశారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని, రిక్షాను స్వాధీనం చేసుకున్నారు.