నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సీ-క్యాట్ ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
సీ-క్యాట్ 2027 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు సీడాక్ సంస్థ వెల్లడించింది. జనవరి సెషన్ కోసం ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 29వ తేదీలోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. జనవరి 9, 10 తేదీల్ లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుండగా, ఫిబ్రవరి 24 నుంచి పీజీ సర్టిఫికెట్ కార్యక్రమాల కొత్త బ్యాచ్ తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.