టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్: జియో నుంచి సరికొత్త ఫ్రీడమ్ ప్యాక్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం పదివేల రూపాయల ధరతో సరికొత్త ఫ్రీడమ్ ప్యాక్‌ను పరిచయం చేసినట్లు రిలయన్స్ జియో సంస్థ వెల్లడించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు పదిహేను నెలల సర్వీస్ వ్యాలిడిటీతో పాటు నూట ఎంబీపీఎస్ వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుందని కంపెనీ అధికారులు స్పష్టం చేశారు. జియోఫైబర్ కస్టమర్లకు మూడు పాయింట్ మూడు టెరాబైట్ల డేటా, ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు ఒక టెరాబైట్ డేటాతో పాటు అనేక ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.