రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి: ఉన్మాది ఘాతుకంపై తీవ్ర దిగ్భ్రాంతి
రిపోర్టర్: విజయ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది జరిపిన దాడి అత్యంత అమానవీయమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయాల్ లో తీవ్ర కలకలం రేగింది. తరగతి గదిలోకి చొరబడి బాలికపై దాడి చేయడంపై పలువురు ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.