'వెండి రేకుపై విశ్వకర్మ చిత్రం': అద్భుత ప్రతిభ చాటిన స్వర్ణకారుడు

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విశ్వకర్మ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మ చిత్ర కళాకారుడు ముగడ జగదీష్ తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. కేవలం నాలుగు గ్రాముల వెండి రేకుపై విశ్వకర్మ భగవాన్ రూపాన్ని చేతితో ఎంతో స్పష్టంగా చెక్కారు. ఈ అరుదైన సూక్ష్మ చిత్రపటాన్ని తయారు చేయడానికి తనకు మూడు గంటల సమయం పట్టిందని, కళపై ఆసక్తి ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని జగదీష్ తెలిపారు.