కన్నీటి సంద్రమైన కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తుక్కాపురం గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు తల్లి స్వర్గీయ జనగాం మారమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మారమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో పార్టీ, తాను కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.