వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలపై అణచివేత: మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం

రిపోర్టర్: సునీల్ స్థలం: కృష్ణా

వైసీపీ ఐదేళ్ల పాలన పూర్తిగా వెనుకబడిన తరగతుల ప్రజలను అణచివేయడం, అణగదొక్కడమే లక్ష్యంగా సాగిందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆ పార్టీ హయాంలో వందలాది మంది బీసీ నేతలను హత్య చేశారని, భౌతిక దాడులు చేసి దుర్మార్గాలకు పాల్పడినప్పటికీ కనీసం కేసులు కూడా నమోదు చేయలేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విమర్శలు గుప్పించారు.