ఉపగ్రహ నిఘాకు చిక్కికుండా రైతుల వ్యూహాలు: పెరుగుతున్న గడ్డి దహన కేసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
శాటిలైట్ల కంటికి చిక్కకుండా పంజాబ్, హర్యానా రైతులు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో అబ్దుల్ కలాం అనుసరించిన పద్ధతులను పోలిన వ్యూహాలతో స్టబుల్ బర్నింగ్ ఘటనలు జరుగుతున్నాయని ఐ ఫారెస్ట్ సంస్థ వెల్లడించింది. ఉపగ్రహాల రాకపోకల సమయాన్ని గమనిస్తూ వాటి కంటికి చిక్కకుండా పొలాల్ లో మంటలు పెడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కచ్చితమైన సమాచారం కోసం ఫైర్ వాచ్ పేరుతో సరికొత్త మల్టీ శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించారు.