అగ్నివీరులకు భారీ ఊరట: సేవా కాలపరిమితిని ఆరేళ్లకు పెంచిన కేంద్రం

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

భారత సాయుధ బలగాల్ లో నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో సేవ కాలపరిమితిని పెంచుతూ కేంద్ర రక్షణ శాఖ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కీలక ప్రకటన విడుదల చేశారని అధికారులు తెలిపారు. నాలుగు సంవత్సరాల సేవలు పూర్తిచేసుకున్న వారిలో డెబ్బై ఐదు శాతం మందికి అదనంగా మరో రెండు సంవత్సరాల పాటు సేవలను పొడిగించనున్నట్లు వెల్లడించారు. ఈ అదనపు సర్వీసు అభ్యర్థుల స్వచ్ఛంద నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.