మహ్మద్ షమీ జట్టులోకి పునరాగమనంపై సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: India
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి పునరాగమనంపై మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న షమీని ఎవరూ విస్మరించలేరని, అతడు త్వరలోనే జట్టులో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోగలడమని గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. కెరీర్‌లో ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని ఆయన గుర్తుచేసుకున్నారు.