బెంగళూరులో కేవలం పదిహేను వేలకే ఏసీ ఫ్లాట్ పొందిన టెకీ

రిపోర్టర్: మహేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులో తక్కువ అద్దెకు ఇల్లు దొరకదంటూ ఎద్దేవా చేసిన వారికి టెకీ రితిక్ గులాబ్రాణి తన అనుభవంతో సరైన సమాధానం చెప్పారు. బెంగళూరులోని బెలందూర్ ప్రాంతంలో కేవలం పదిహేను వేల రూపాయల నెలసరి అద్దెకే ఏసీ ఫ్లాట్ సాధించినట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫేస్బుక్ గ్రూప్ ద్వారా నేరుగా యజమానులను సంప్రదించి ఈ అద్దె ఇల్లు దొరికిందని, ఎప్పుడూ ప్రయత్నం ఆపకూడదని టెకీ పేర్కొన్నారు.