దీపావళికి టపాసుల జాగ్రత్తలపై జన్నారం అగ్నిమాపక అధికారి గర్జన

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

దీపావళి పండుగకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంతోషంగా జరుపుకోవాలని జన్నారం మండల అగ్నిమాపక శాఖ అధికారి దేవానంద్ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. టపాసులు పేల్చే సమయంలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అజాగ్రత్తకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.