వాగు దాటలేక వైద్యం అందక గర్భిణి దుర్మరణం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ గంగవరం గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని సరైన సమయంలో ఆసుపత్రికి తరలించే మార్గం లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రికి తరలించలేని దుస్థితిలో ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.