ఏపీపీసీబీలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల మార్పు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో జూనియర్ ఇంజనీర్ పోస్టును అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్, మెకానికల్, కెమికల్ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ అర్హతను నిర్ణయించగా, ఈ పోస్టులను బదిలీ మరియు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసే అధికారాన్ని ఏపీపీసీబీకే అప్పగించారు.