వైసీపీలో తీవ్ర కలకలం: టికెట్ దక్కలేదని అరగుండుతో మాజీ కార్పొరేటర్ నిరసన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విశాఖపట్నం
వైసీపీలో టికెట్ నిరాకరించడంతో విశాఖపట్నంకు చెందిన మాజీ కార్పొరేటర్ బిపిన్ జైన్ అరగుండుతో రోడ్లపై నిరసన తెలిపారు. పార్టీ కోసం నాలుగేళ్లు కష్టపడ్డా తనకు తీవ్ర అన్యాయం చేశారని బిపిన్ జైన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. డాబాగార్డెన్స్ ప్రాంతంలో చాక్లెట్లు పంచుతూ వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించానని, తనకు ఎటువంటి పదవులు వద్దు కేవలం టికెట్ ఇస్తే చాలని ఆయన వాపోయారు.