పాప్ రారాజు నెవర్ లాండ్ ఎస్టెట్ పై ప్రిన్స్, బిగి కీలక ఆలోచనలు
రిపోర్టర్: హరి
స్థలం: California
దివంగత పాప్ రారాజు మైకెల్ జాక్సన్ కుమారులు ప్రిన్స్, బిగి తమ తండ్రి ప్రసిద్ధ నెవర్ లాండ్ ఎస్టెట్ ను అస్వస్థత, పేదరికంతో బాధపడే చిన్నారుల కోసం సేవా కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మైకెల్ జాక్సన్ అసలు కలను నెరవేర్చేలా ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని వారు భావిస్తున్నారు. ఎస్టెట్ ను పర్యాటక ప్రాంతంగా కాకుండా పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించాలని ప్రిన్స్, బిగి ఇద్దరూ అభిలషిస్తున్నట్లు సన్నిహితులు వెల్లడించారు.