దేశంలోని పారిశ్రామిక రంగంలో ఆరో స్థానంలో నిలిచిన ఏపీ

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఉన్న కర్మాగారాల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచిందని కేంద్ర గణాంకాలు, అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎంవోఎస్పీఐ విడుదల చేసిన 2024-25 వార్షిక సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 15,602 కర్మాగారాలు ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక 13,937 కర్మాగారాలతో తెలంగాణ ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ గణాంకాలు దేశ పారిశ్రామిక ప్రగతిని స్పష్టం చేస్తున్నాయి.