ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన: ఆరెంజ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.