వైరల్ వీడియోపై స్పందించిన నారా లోకేశ్: బాలుడి రక్షణకు అధికారుల చర్యలు
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
అమ్మా నన్ను ఇంటికి తీసుకెళ్లండి అంటూ గొర్రెలు కాస్తూ కన్నీరుమున్నీరైన పదేళ్ల బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడకు చెందిన బాలుడి సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను లోకేశ్ ఆదేశించారు. దీంతో స్పందించిన అధికారులు వెంటనే బాలుడిని రక్షించి, ఆ కుటుంబానికి నిత్యావసర సరకులు అందించడంతో పాటు ఇంటి స్థలం పట్టా మంజూరు చేశారు.