హైదరాబాద్ లో కలకలం: బీజేపీ నేత సాయిప్రసాద్ పై లైంగిక దాడి కేసు నమోదు
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
హైదరాబాద్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ జాతీయ మాజీ కోశాధికారి పి.ఎం. సాయిప్రసాద్ పై లైంగిక దాడి ఆరోపణలతో తాజాగా కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. గతంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వరుస నేర ఆరోపణలు, శాంతిభద్రతల ఉల్లంఘన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఆయనపై రౌడీ షీట్ తెరిచారని, బాధితురాలిని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడటంతో చట్టపరమైన చర్యలను మరింత తీవ్రతరం చేశామని అధికారులు స్పష్టం చేశారు.