మదనపల్లెలో నకిలీ పత్రాలతో భూ ఆక్రమణ: రౌడీషీటర్ సులోచన సహా ముగ్గురు అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: మదనపల్లె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూమిని కబ్జా చేసిన ఘటనలో రౌడీషీటర్ కోనేటి సులోచనతో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని టూటౌన్ ఎస్ఐ నాగేశ్వర్రావు వెల్లడించారు. పీటీ వారెంట్ పై వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ అక్రమ భూ ఆక్రమణ వ్యవహారంలో మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.