బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ 'హైవాన్' రెండో రోజు కలెక్షన్ల డ్రాప్
రిపోర్టర్: హరి
స్థలం: India
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'హైవాన్' సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గాయి. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రం శనివారం రోజున రూ. 2.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో మొత్తం రూ. 5.50 కోట్లు రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటింది.