కరీంనగర్‌లో ఏటీఎంలను ధ్వంసం చేసి భారీ నగదు చోరీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో ధ్వంసం చేసి దుండగులు నగదుతో పరారయ్యారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు, ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ ఏటీఎంలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ చోరీకి పాల్పడిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.