ఆరోగ్యానికి గొప్ప మార్పు: ప్రతి గంటకు ఐదు నిమిషాలు నడవాలని నిపుణుల సూచన

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

నిరంతరం కూర్చుని పనిచేసే జీవనశైలి ఆరోగ్యానికి ఎంతో హానికరం అని, ప్రతి గంటకు కేవలం ఐదు నిమిషాల పాటు నడవడం వల్ల శరీరంలో అద్భుతమైన ఆరోగ్య మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాంబ్రిడ్జ్, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ చిన్న అలవాటు ఎంతో బాగా తోడ్పడుతుందని నిపుణులు తెలిపారు.