రేణికుంటలో ఘనంగా విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక వేడుకలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం రేణికుంట గ్రామంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు విహెచ్పి స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండ సురేష్ మాట్లాడుతూ దేశం, ధర్మం మానవునికి రెండు కళ్ల లాంటివని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

విశిష్ట అతిథి దుశెట్టి బాలకిషన్ మాట్లాడుతూ సమాజంలో హిందువులపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు యువత ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా సహ కార్యదర్శి బూరుగు సంతోష్ రెడ్డి, మండల కార్యదర్శి ఇమ్మడి ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.