సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ సీఎం చంద్రబాబును టీటీడీ పాలకవర్గం అధికారికంగా ఆహ్వానించింది. అమరావతిలోని ఆయన నివాసంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల భద్రతపై చర్చించారు.