ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ఇద్దరు శిశువులు మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: Adilabad

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్ సీయూ వార్డులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదు రోజుల పసికందుతో పాటు మరో శిశువు మృతి చెందారు. రాత్రి పదిహేను నిమిషాలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది మిగతా ఇరవై ఎనిమిది మంది చిన్నారులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.