కుటుంబాలను విడగొట్టే విధానాలను తక్షణమే రద్దు చేయాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

కుటుంబాలను విభజించేలా ఉన్న ప్రభుత్వ విధానాలను వెంటనే రద్దు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, కుటుంబం యూనిట్‌గానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. కొత్త పింఛన్ల మంజూరుకు ముందే కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని, ప్రతి నెలా 1వ తేదీని సంక్షేమ దినంగా నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం కూడదన్నారు.