మురసు తుపాను బీభత్సం: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్ లో అల్లకల్లోలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గుంటూరు
మురసు తుపాను ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తీవ్ర బీభత్సం సృష్టించిందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని దాటిన ఈ తుపాను కారణంగా ఈదురుగాలులు, జోరువానలతో తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరా నిలిచిపోయింది. బాపట్ల జిల్లాలో ఐదుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.