లాటరీ తగల్లేదని షాప్ యజమానిపై కత్తితో దాడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వయనాడ్
లాటరీ టికెట్లలో ప్రైజ్ రాలేదన్న కోపంతో షాప్ యజమానిపై వ్యక్తి దాడి చేసిన ఘటన కేరళలోని వయనాడ్‌లో జరిగింది. తమిళనాడుకు చెందిన శివకుమార్ మద్యం మత్తులో లాటరీ షాప్‌కు వచ్చి విక్రేత వినిత రాజేష్ మెడపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.